ఏకకాలంలో హనుమకొండ ఖమ్మం జిల్లా కేంద్రాల్లో సోదాలు
తహసిల్దార్ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్న బృందాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
ఆగస్టు 29 (రాజు)
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది హనుమకొండ లోని చైతన్యపురి ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా కేంద్రం లోని ఇళ్లపై ఏక కాలంలో ఏసీబీ బృందాలు దాడులు నిర్వహించాయి శుక్రవారం ఉదయం ఈ దాడులు మొదలు కాగా ఖిల వరంగల్ మండల తహసిల్దార్ కార్యాలయం లోనూ సోధాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయం లోని సిబ్బందిని విచారిస్తుండడం తో పాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న బండి నాగేశ్వరరావు పై ఏసీబీ దాడులు నిర్వహించడం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతుంది ఖిలా వరంగల్ తహసిల్దారుగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్పర్తి, కాజీపేట తాసిల్దార్ గా పని చేశారు ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





