నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 24 శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే ఆలయంలో అమ్మవారికి వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో విశేష అభిషేకము అలంకరణ నిర్వహించారు అనంతరం భక్తుల సమక్షంలో రాహుకాల సమయం నందు అభిషేకం చేశారు ఈ అభిషేకంలో పాల్గొన్న వారికి సకల సుఖాలు శుభాలు జరుగుతాయని వేద పండితులు అంటున్నారు ఈ సందర్భంగా అభిషేకానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం పాత కళ్యాణ్ కట్ట వద్ద అన్నప్రసాద శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం అధికార ఆర్చక సిబ్బంది భక్తులకు సేవలు అందించారు





