నేటిసాక్షి, మిర్యాలగూడ : మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి నిరంతర నిఘాలో భాగంగా మిర్యాలగూడ శివారులోగల అగ్రి గోల్డ్ వెంచర్ లో గంజాయి తాగుటకు గంజాయి తెచ్చుకున్నారన్న నమ్మదగిన సమాచారము మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్సై సైదిరెడ్డికి నమ్మదగిన సమాచారం రాగా, మంగళవారం వారి సిబ్బందితో వెంచర్ ను చేరుకునే సమయానికి ఆరుగురు యువకులు గంజాయిని కలిగి వున్న కవర్ తో వుండగా పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుబడిచేసి వివరాలు తెలుసుకుని విచారించి, వారి వద్ద నుంచి ఒక నలుపు పోలితినే కవర్ లో ఉన్న 1.4 కేజీ బరువు కలిగిన గంజాయి ప్యాకెట ను ఒక సెల్ ఫోన్ ను స్వాధీన పరుచుకున్నట్లు డిఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు షేక్ అఫ్రోజ్, ననావాత్ అశోక్, మహమ్మద్ నసీరుద్దీన్ బాబా, షేక్ హైమద్, వల్లవాయి నవీన్, మల్లెబోయిన రాకేష్, మారి లు స్నేహితులు. వీరు సాయిరాం ద్వారా గంజాయి త్రాగడం అలవాటు అయ్యిందని, వీరంతా కలిసి గంజాయి త్రాగేవాళ్ళు,ఎప్పటిలానే ఈ ఆరుగురము కలిసి ఒక్కొక్కరు రూ.1200 వేసుకొని రూ.7200లతో సాయిరామ్ దగ్గర సుమారు 1.4 కేజీ గంజాయి ప్యాకెట్ ను అద్దంకి-నార్కట్పల్లి హై వే వద్ద వై జక్షన్ వద్ద కొనుగోలుచేసి, యథావిధిగా అపుడప్పుడు గంజాయి పంచుకొని తాగేవారు. మిర్యాలగూడ పట్టణ శివార్లలో గల అగ్రిగోల్డ్ వెంచర్ లోకి వెళ్లి అందులో పంచుకొనే క్రమములో పోలీస్ వారుపట్టుబడిచేసినారని తెలిపారు. మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు, ఎస్ డిపిఓ పర్యవేక్షణలో ఇట్టి కేసు ను చేదించడం లో ప్రతేక ప్రతిభ కనపరిచిన వన్ టౌన్ సిఐ నాగభూషణ రావు, ఎస్సై సైదిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్స్ నల్లగంతుల శ్రీను, గద్దల హుస్సేన్, వీరబాబు, నర్సింహా, భీమనపల్లి ప్రసాద్, శివాజీ, హోం గార్డ్ సాయి, గిరి, అనిల్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు.





