నేటి సాక్షి వికారాబాద్:జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి కె.విజయభాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యం లో 28.12.2025 ఆదివారం రోజు మోమినపేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో (01 )గంజాయి కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. వివరాల ప్రకారం రానున్న నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ జిల్లా బోర్డర్ లో డీటీఫ్(డీటీఫ్) వికారాబాద్ టీం మర్పల్లి మండల పరిధిలోని మొగిలిగుండ్ల చౌరస్త దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా ఒక వ్యక్తి గ్లామర్ బైక్ పై ఒక బ్యాగ్ పెట్టుకొని బుదేరా చౌరస్తా నుండి మర్పల్లి వైపు వస్తుండగా అట్టి వ్యక్తిని ఆపి బ్యాగ్ ను సోదా చేయగా అందులో ఎండు గంజాయి లభిచిoది దాని పరిమాణం(2.026)కేజీలు ఉండెను. అట్టి వ్యక్తి ని అదుపులోకి తీసుకొని ఎండు గంజాయి, గ్లామర్ బైక్, మొబైల్ సీజ్ చేసినారు, అట్టి వ్యక్తి వివరాలు పేరు: బుసరెడ్డిపల్లి శివ కుమార్ S/o బసప్ప వయస్సు:33 సంవత్సరాలు, R/o హైదలపూర్ గ్రామం మునిపల్లి మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని తెలిపారు. తదుపరి అ వ్యక్తి ని విచారించగా తక్కడపల్లి గ్రామం మునిపల్లి మండలం కు చెందిన గొల్ల ఈశ్వరయ్య వ్యక్తి నేను కలిసి గంజాయి సాగు చేసి విక్రయిస్తామని తెలిపాడు. పట్టుబడిన వ్యక్తి నిఅరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు, ఈశ్వరయ్య ని తర్వాత అరెస్ట్ చేస్తామని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ కె.శ్రీనివాస్ తెలిపినారు.ఇట్టి దాడుల్లో ఎస్సై బి .ప్రేమ్ కుమార్ రెడ్డి సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి, శివప్రసాద్,హనుమంతు, రవికిరణ్, మహేందర్, కుమార్ , లు పాల్గొన్నారు.ఈ విధంగా అక్రమంగా గంజాయి ని త్రాగడం, అమ్మడం, కలిగి ఉండటం చట్ట రీత్యా నేరం కావున ఎటువంటి “మాదకద్రవ్యాల” సమాచారం ఉన్న కింద తెలిపిన నంబర్స్ కి సమాచారం ఇవ్వ వల్సింది గా కోరుచున్నాము. మీ వివరాలు గోప్యం గా ఉంచబడతాయి. మాధక ద్రవ్యాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ ఎంతగానో కృషి చేస్తుంది. నిక్కచ్చి గా వ్యవహరిస్తుంది కావున ప్రజలు అందరు సహకరించ గలరని కోరుచున్నాము అని జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి కే .విజయభాస్కర్ తెలిపారు.

