నేటిసాక్షి/ములుగు ప్రతినిధి మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నర్సాపూర్ గ్రామంలో నాగులమ్మ జాతర రెండో రోజు బుధవారం నాగులమ్మ సడాలమ్మ రాక తో జాతర ముఖ్య ఘట్టం ప్రారంభమైంది ఉదయం 11గంటలకు నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యంలో ఆదివాసీ పూజారులు వడ్డెలు సమీపంలో ఉన్న గండోర్రె గుట్ట ప్రాంతంలో సుమారు రెండు గంటలకు పైగా నాగులమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదే సమయంలో ఎర్రెట్టల గుట్ట వద్దకు వెళ్ళిన పూజారులు సడాలమ్మ కు పూజలు చేసి నాగులమ్మ ను సడాలమ్మ ను అర్థి బిడ్డల డోలు వాయిద్యాల నడుమ తీసుకు వొచ్చి లక్ష్మి నర్సాపూర్ గ్రామంలో నాగులమ్మ కు చెందిన డాలు జెండాలతో ఎదుర్కోలు నిర్వ హించారు.అనంతరం రమణక్కపేట సమీపంలో గల గోదావరి నది వద్దకు చేరుకొని పూజారులు ఏడు చెలిమలు తీసి వివిధ రకాల దళాలతో అభిషేఖాలు పుణ్యస్నానాలు నిర్వహించారు.అనంతరం నాగులమ్మ ఆలయానికి తీసుకు వొచ్చి గద్దెలపై ప్రతిష్టించారు రాత్రి 8 గంటలకు చుంచుపల్లి గ్రామం నుండి అమ్మవారికి చెందిన అవిరేణి కుండలను ఆదివాసీ మహిళలు ఆలయానికి సమర్పించారు ఆలయ ధర్మకర్త మేనేజింగ్ ట్రస్టీ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి పూజ కార్యక్రమాలను పర్యవేక్షించగా పూజారులు సోడి సత్యం కుర్సం పుల్లయ్య కట్టం సమ్మక్క చౌళం భవాని,మడకం సుప్రజ,పోలిశెట్టి స్వరూప,వడ్డెలు కోర్స శ్రీకాంత్ మూయబోయిన శివ తుర్స చిన్నబ్బాయి కారం రాజేష్ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కులపెద్దలు కుర్సం విష్ణుమూర్తి మడకం రాజేశ్వర్ రావు చౌళం వెంకటేశ్వర్లు కొమరం మాధవ రావు,కొమరం పాపారావు పాల్గొన్నారు.





