పంటపొలాలను, ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోండి..
అటవీశాఖ అధికారులకు సూచించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
ఇటీవల కాలంలో.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో.. గజరాజులు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో.., అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.. వారి ప్రాణాలకు భద్రత కరువైంది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు గ్రహించి, రైతుల రక్షణకు కల్పించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సంబంధిత అధికారులకు సూచించారు. అదే సమయంలో ఏనుగుల బారి నుండి పంట పొలాలు, ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు.,.
చిత్తూరు పార్లమెంటు పరిధిలో అడవులకు సమీపంలో ఉన్న పంట పొలాల పై గజరాజులు విరుచకపడుతూ… బీభత్సం సృష్టిస్తున్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు… శుక్రవారం ఢిల్లీ నుంచి స్పందించారు. ఏనుగుల రాకను అడ్డుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా.., ఏదో మార్గాన అడవుల నుంచి ఏనుగులు జనావాసాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు కూడా ఆమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గజరాజులు తమ ఉనికిని చాటుతూ రైతన్నలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొందరు రైతులైతే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు తమ ప్రాణాలనే ఫణంగా పెడుతూ..,వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారని ఎంపీ దగ్గుమళ్ళ ఆవేధన వ్యక్తం చేశారు. ఏనుగుల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలని రైతులు తనకు మొరపెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ద్వారా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
అటవీశాఖ అధికారులు కూడా గజరాజుల బారి నుంచి అన్నదాతలకు రక్షణ కల్పించాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.