Friday, March 20, 2026

గణిత ప్రయోగ దీపికను సద్వినియోగం చేసుకోవాలి

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని బకలవాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డివిజన్ లోని గణిత ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధన జరగడానికి ప్రయోగ దీపిక ఎంతో అవసరం అని అన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ సైదిరెడ్డి, మేహారాజ్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కొర్ర కృష్ణ కాంత్ నాయక్ మాట్లాడుతూ, గణితప్రయోగ దీపిక అనేది విద్యార్థి కేంద్రీకృతమై ప్రయోగాలు చేయడం ద్వారా గణిత సమస్యలు విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని అన్నారు. తద్వారా కఠిన సమస్యలను సులభంగా నేర్చుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎంఎఫ్ నాయకులు పండిత్ రెడ్డి, జ్యోతి, శ్రీశైలం, రామిరెడ్డి, గణిత ఉపాధ్యాయులు స్కైలాబ్, వెంకటేశ్వర్లు, బాలు, సంతోష్, శశిధర్ రెడ్డి, నానితారియ, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, శోభ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News