నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులతో, సిబ్బందితో సమావేశమయ్యారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరియు ప్రజా సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అధికారులు మరియు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గన్నేరువరం మండలం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎంపీడీవో. హామీ ఇచ్చారు.





