నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గంను ఎన్నికల అధికారి తెల్ల అంజయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తెల్ల రవీందర్, గౌరవ అధ్యక్షులుగా తెల్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా మచ్చ బాలరాజు,ప్రధాన కార్యదర్శిగా సబ్బని మహేష్, కోశాధికారిగా ఓడ్నాల అంజయ్య, కార్యదర్శిగా వేముల రవి కుమార్, సంయుక్త కార్యదర్శిగా తెల్ల లక్ష్మణ్, ముఖ్య సలహాదారులుగా తెల్ల అంజయ్య, వెంగళ కమలాకర్ కార్యవర్గ సభ్యులుగా భీమనాతిని ధర్మయ్య, చిప్ప శోభన్, వేముల లక్ష్మీపతి, బూర లక్ష్మణ్, వేముల రాములు, గాలి చంద్రశేఖర్ లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తెల్ల రవీందర్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి సభ్యులను అందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. పద్మశాల హక్కుల కొరకు ఐక్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బూర రామకృష్ణ, తెల్ల భాస్కర్, బూర వెంకటేశ్వర్లు, తెల్ల సుధాకర్, బలరాం, గాలి ఆంజనేయులు, వార్డు సభ్యులు మచ్చ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

