*నేటి సాక్షి,గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్):* మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు రాజేశ్వరి, మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్ కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ అల్వాల కోటి చొక్కారావు పల్లి సర్పంచ్ గోపాల్ రెడ్డి, కటకం తిరుపతి, వార్డు మెంబర్ సతీష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

