Tuesday, March 17, 2026

గన్నేరువరం యాసాడ గ్రామాల మధ్య ఎలుగుబంటు సంచారం కథనానికి స్పందన

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల కేంద్రం లోని గన్నేరువరం యాస్వాడ గ్రామ శివారులో19/12/2025 ఎలుగుబంటు సంచారం కథనానికి స్పందించి గ్రామస్తులు వ్యవసాయ పనులను వద్దకు వెళ్లే రైతులు డైరీ ఫారం నిర్వాహకులు భయాందోళన గురవుతున్న విషయం తెలుసుకొని గ్రామ సెంటర్లో ఆవరణ అవగాహన కార్యక్రమం చేపట్టారు రైతులు వ్యవసాయ పొలాల వద్ద నుండి పనులు ముగించుకొని తొందరగా ఇంటికి చేరుకోవాలని ఒక వేళ వెలుగుబంటి కనిపిస్తే పొలాల వద్ద చిన్న మంట పెట్టి పొగ వచ్చేలా చేయాలని ఎలుగుబంటిని కర్రలతో కొట్టరాదని పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లల జగన్ మోహన్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్ గొల్లపల్లి లక్ష్మయ్య కొట్టే రవి ఎగిరే దేశరాజు రాజేంద్ర చారి దేశరాజ్ అనిల్ రాపోలు కిట్టయ్య గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News