నేటిసాక్షి,గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలంకేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. డబ్బు చప్పుల మధ్య మహిళలు బోనం ఎత్తుకొని శివసత్తుల పూనకాలతో నృత్యాలు చేసుకుంటూ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు. పిల్ల పాపలతో పాడిపంటలతో చల్లగా చూడాలని అమ్మవార్లను వేడుకున్నారు. అనంతరం అమ్మవారికి ఓడి బియ్యం కల్లు శాఖ నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు బాలయ్య, బొడ్డు సునీల్, గొల్లపెల్లి రవి, దొగ్గలి ప్రదీప్, అరిగెల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

