Saturday, March 14, 2026

*గరుడవారధిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, చక్కగా నిర్వహణ చేయండి.**స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ ఎన్. మౌర్య.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి లోని గరుడవారధిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, డివైడర్ల మధ్య మొక్కల నాటి పచ్చదనం పెంచి చక్కగా నిర్వహణ చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య స్మార్ట్ సిటీ అధికారులు, ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గరుడ వారధి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తదితర ప్రాజెక్ట్ల పురోగతిని ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడవారధి రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని, అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గరుడవారధి కింద డివైడర్ల మధ్య, కూడళ్లలో పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరాల పనులు డిసెంబర్ నెల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జి. ఎం. చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఈ.ఈ. రవి, డిసిపీ ఖాన్, డి.ఈ.లు రాజు, శిల్ప, ఏసీపీ లు మూర్తి, మధు,ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News