నేటిసాక్షి, మిర్యాలగూడ : గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, బ్లడ్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని అర్భన్ సిడిపిఓ మమత అన్నారు. మిర్యాలగూడ అర్భన్ ప్రాజెక్ట్ పరిధిలోని గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని మొదట పాప పుట్టి, రెండవసారి గర్భిణీ గా ఉన్న లబ్ధిదారురాలు ఇంటికి బుధవారం అర్భన్ సీడీపీఓ మమత వెళ్లి, గృహ సందర్శన చేశారు. ఈ గృహ సందర్శనలో భాగంగా మమత మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రుపాలు పట్టించాలని, ఇటీవల కాలంలో అనేక రకాల శిశు విక్రయాలు జరుగుతున్నాయని, అది తీవ్రమైన నేరమని, ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయత్నించినా, విక్రయించినట్లు తెలిసినా చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా పుట్టేవారు పాప ఐనా, బాబు అయినా సమానంగా చూడాలని, లింగ వివక్షత చూపకూడదని, ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ నజీమా బేగం మొహ్మద్, బ్లాక్ కో- ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్ అరుణ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





