Wednesday, March 18, 2026

*గల్ఫ్‌లో కామారెడ్డి వాసి సంగమేశ్వర్ ఆత్మహత్య** షార్జాలో జరిగిన విషాద ఘటన – స్వగ్రామానికి తరలింపుకు ‘భారత్ సేవా సమితి’ సహకారం—*

నేటి సాక్షి – కామారెడ్డి*కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్వర్ (39) గల్ఫ్ ఉపాధి కోసం ఏడాది నర కిందట షార్జాకు వెళ్లి కార్మికునిగా పనిచేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో దుబాయ్–షార్జాలో కష్టం మీద జీవనం సాగిస్తున్న సంగమేశ్వర్, పని చేసే చోటే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ దుర్వార్తను 10-10-2025 నాడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.*కంపెనీ–సంస్థల సహాయంతో మృతదేహం స్వగ్రామానికి*సంగమేశ్వర్ మృతదేహాన్ని పంపడంలో అతని స్నేహితులు మన్నె సాయిలు ముందుండగా, “భారత్ సేవా సమితి దుబాయ్”కు చెందిన బొమ్మ ప్రవీణ్ కంపెనీ వర్గాలతో మాట్లాడి అవసరమైన అధికార ధృవీకరణ పత్రాలు ఇంటి వద్ద నుంచి తెప్పించేలా చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యడంతో 11.11.2025 నాడు షార్జా నుండి హైదరాబాద్‌కు మృతదేహం రానున్నట్లు తెలిపారు.*అంబులెన్స్ ఏర్పాటు – ప్రత్యేక చొరవ*మృతదేహాన్ని స్వగ్రామమైన అయిలాపూర్‌కు చేరవేయడంలో కంపెనీ తరఫున సహాయం లభించగా, “భారత్ సేవా సమితి” సభ్యులు చివరి ప్రయాణ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత అయిలాపూర్ వరకూ తరలించేందుకు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సమితి సభ్యుడు బొమ్మ ప్రవీణ్ తెలిపారు.—-

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News