( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 21:)* రాష్ట్రంలో బెల్ట్ షాపుల నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అధికారులు బెల్టుషా పులపై దాడులు నిర్వహించి పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలలో మద్యం,గం జాయి,మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగాయి. యువత మత్తులో తూగుతూ ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో కొంతమంది సినీ తారల పైన డ్రగ్స్ ఆరోపణలు బలంగానే వెల్లువెత్తాయి.ఏకంగా కొంతమందిని పోలీసులు విచారించి కేసులు కూడానమోదు చేశారు. కేసులు ఏమయ్యాయో ఇప్పటివ రకు తెలియదు. అయితే తనిఖీలతో కాకుండా బెల్టు షాపులు, డ్రగ్స్ ముఠాలపై ఉక్కు పాదం మోపే విధంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ మాఫియా పై అనేక మార్లు దాడులు చేసి అధికారులు చేతులు దులుపుకున్న ఘటనలు ఎన్నో. ఎందుకంటే గతప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసు కుంటారనే ఆరోపణలు పెద్దఎత్తున వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా మడ్యం. లిక్కర్, డ్రగ్స్, గంజాయి, భూముల, మట్టి, ఇసుక మాఫియా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయనే చెప్పవచ్చు. డ్రగ్స్ మాఫియా పై కఠిన చర్యలు తీసు కోవాలని, అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తు న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అధికారులు కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు వెనుకడుగు వేయకుండా నిజాయితీగా వ్యవహరించాలని ప్రజలు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను నిర్మూలించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే అది సాధ్యమవుతుందని అంటున్నారు. మత్తు పానీయాలు నిర్మూలన చేసేందుకు పోలీసు అధికారులకు కొన్ని ప్రత్యేకఅధికారాలు ఇవ్వాలని ప్రజలు సూచిస్తున్నారు.*బెల్టుషాపులపై చర్యలు శూన్యం:*యువత మత్తుకు బానిసలు కావడం వెనకాల కొంతమంది బడా నేతలు ఉన్నారనే ఆరోపణలు విని పిస్తున్నాయి. చర్యలు చేపడితే వారి వ్యాపారాలకు అడ్డంకిగా మారుతుందని అందుకే బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారని అక్రమంగా మద్యం అమ్మకాలు ఎక్కువ జరిగితే సొమ్మును చేసుకోవచ్చనే కుట్ర జరు గుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. యువత భవి ష్యత్తును నాశనం చేస్తున్న వారు ముఖ్యంగా రాజకీయ నాయకుల అండదండలతో వ్యాపారవే త్తలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బే లక్ష్యంగా ఇలాంటి నీచ పనులు చేస్తూ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. మందు అలవాట్లు చేసి తమ స్వంత స్వార్ధం కోసం వెంట తిప్పుకుంటు జేజేలు కొట్టించుకుంటు యువతను కుటుంబాలకు దూరం చెయ్యడమే కాకుండా నెల రాలదానికి కారణం అవుతున్నారు.





