Wednesday, March 18, 2026

గాడి తప్పిన పాలన..ఏడాదిన్నర పాలనకే కూటమి ప్రభుత్వానికి అర్థమయిపోయిందా..!

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 20~అన్నమయ్య జిల్లా :- ఏపీ లో కూటమి పాలనకు సరిగ్గా ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. 18 నెలల కాలంలో ప్రభుత్వం సాధించిందేది లేదని స్వయంగా సీఎం చంద్రబాబే ఒప్పుకున్న పరిస్థితి ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. కలెక్టర్ల సమావేశం లో సీఎం చంద్రబాబు ఒప్పేసుకుంటూ ప్రజలు మెచ్చేలా పాలన చేయలేకపోతున్నామంటున్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల పనితీరు కూడా సరిగ్గా లేదని బాహటంగా చెప్పేస్తున్నారు. చంద్రబాబు నిత్యం రకరకాల నివేదికలు తీసుకుంటారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వ చేస్తున్న ప్రతి కార్యక్రమనికి సంబంధించి ఏ సమయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారని బేరీజు వేసుకున్నాకే చంద్రబాబు స్పందన ఉంటుంది. సరిగ్గా ప్రస్తుతం ఇదే కాంటెస్ట్ లో ప్రజలు మెచ్చేలా పాలన లేదని చంద్రబాబు అంటున్నారు. ఎదో ఆషామాషీ వ్యక్తి అంటే ఈ కామెంట్స్ కు పెద్ద ప్రయార్టీ అవసరం లేదు. కానీ సీఎం స్థాయి లో ఉన్న వ్యక్తి ఇలా వ్యాఖ్యాదిస్తున్నారంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో పలు వర్గాల్లో ఈ అంశం బాగా చర్చనీయాంశంగా మారింది. ఏడాదిన్నర లో ప్రజలు మెచ్చేలా పాలన లేకపోవడానికి అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. అమరావతిపైనే చంద్రబాబు పూర్తిగా ఫోకస్ పెట్టారనే అభిప్రాయాలు ఉన్నాయి. అమరావతి పై పెట్టిన ఫోకస్ వల్ల కావచ్చు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందేమోననే చర్చ కావచ్చు. సహజంగానే మిగిలిన ప్రాంతాల్లో కొంత అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక యాంగిల్ మరో వైపు అమరావతి కి భూములను ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. వేల ఎకరాలు తీసుకొని ప్లాట్లు కేటాయింపు జరగక అనేక రకాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా పాలన పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరింది. కూటమి అధికారం లోకి వచ్చిన మూడు నెలల నుంచి ఎమ్మెల్యే లపై అసంతృప్తి మొదలైంది. సీఎం చంద్రబాబు ఇప్పటికి ఒక పది సందర్భాల్లో ఎమ్మెల్యే ల అవినీతి పై అనేక రకాలుగా వార్నింగ్ ఇచ్చారు. సాండ్. ల్యాండ్, లిక్కర్, రియల్ ఎస్టేట్ బెదిరింపులు ఇలా ఒకటి కాదు. అనేక రకాల మాఫియా ల్లో కొంతమంది ఎమ్మెల్యే లు ఇరుక్కుంటున్నారనే చర్చ బాగా వినిపిస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అనేక రకాలుగా చెప్పారు. అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలలో ఎలాంటి మార్పు లేదు. ఎమ్మెల్యే లకు సామాన్య జనానికి ఉన్న లింక్ తెగిపోయింది. అదే విధంగా కార్యకర్తలు కు ఎమ్మెల్యే ల మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో సీఎం చంద్రబాబు కు ఈ విషయం అర్ధమయ్యి ఎమ్మెల్యే లపై వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించారు. అందుకే ఎమ్మెల్యే లు తమ పనితీరు మార్చుకోవాలని పదే పదే చెబుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యే లపై వస్తున్న వ్యతిరేకత కూటమి పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకే సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవడం లేదు. దీంతో ఎమ్మెల్యేలపై సీఎంకి కంట్రోల్ లేదనే చెడ్డపేరు తప్పటం లేదు. ఎమ్మెల్యేలు కొంతమంది ఇసుక మాఫియా లో ఇరుక్కుంటున్నారు. ఇది నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. సొంత పార్టీ నేతలు కూడా ఇసుక కావాలంటే అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇసుక వ్యవహారం లో కొంతమంది ఎమ్మెల్యే లపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. ఇకపోతే లిక్కర్ షాపులు, బెల్ట్‌ షాపులు, మద్యం సిండికేట్ వ్యవహారాల్లో కొంత మంది నేతలు ఎమ్మెల్యే లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లిక్కర్ షాపుల్లో జరిగిన వ్యవహరాలు, లెక్కకు మించి బెల్ట్ షాపులు తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. లిక్కర్ సిండికేట్ తో కొంత మంది ఎమ్మెల్యే లు చేతులు కలిపి మాఫియా లో ఇరుక్కున్నారనే అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. ఇక సర్కారు పరువు తీసిన నకిలీ లిక్కర్ స్కామ్ సంగతి సరేసరి. భూ కబ్జాలు ప్రధాన సమస్య గా మారాయి. భూ కబ్జాల పై గత ప్రభుత్వం పై అనేక విమర్శలు చేసి ఇపుడు స్వయంగా కొంతమంది కూటమి నేతలు భూ కబ్జాలలో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో భూ కబ్జా లు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. భూ కబ్జా లో పొలిటికల్ జోక్యం ఎక్కువైందని పవన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. దీంతో స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని భూ కబ్జాల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎవర్నీ వదలొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భూ కబ్జా లు ఎక్కువ అవుతున్నాయని డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేస్కోవచ్చు.రాష్ట్రంలో గంజాయిని అదుపు చేయలేకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది. చాలా ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు బాగా పెరిగాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు క్రైం రేట్‌ బాగా పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో తగ్గినా కొన్ని జిల్లాల్లో పెరగడం మైనస్ అవుతోంది. నేరం చేస్తే మహిళల పై దాడులు చేస్తే అదే చివరి రోజని సీఎం చంద్రబాబు చెప్పినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదనే అభిప్రాయం ఉంది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక పేకాట క్లబ్‌ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏపీ వ్యాప్తంగా పేకాట పరిశ్రమ వైభవంగా వర్థిల్లుతోంది. చాలా ప్రాంతాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ పేకాట క్లబ్ లు రన్ చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పేకాట క్లబ్ లను కొంతమంది పోలీసు అధికారులే సపోర్ట్ చేస్తున్నారని ఇదివరకే చాలా సందర్భాల్లో డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేసారు. ఒక అధికారి పై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే పవన్ చెప్పినా కూడా సదరు అధికారిపై ఎలాంటి యాక్షన్ లేకపోవటం పరిస్థితికి అద్దం పడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్ని సందర్భాల్లో హోమ్ శాఖ పై విమర్శలు చేసారు. తాజాగా భూ కబ్జా లపై మాట్లాడారు. ఎమ్మెల్యే ల పనితీరు మార్చుకోవాలని గతంలో అన్నారు..ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం పై విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ పోటీపడి పాలనా వైఫల్యంపై మాట్లాడటం వైసీపీకి అందివచ్చిన వరంలా మారింది. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అప్పులు పెరగడం కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయింది. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది ప్రభుత్వం ఏడాదిన్నర లోనే ఇంత అప్పు చెయ్యడం అది కూడా పెద్దగా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా అప్పులు చెయ్యడం పై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఇదే కూటమి మండిపడింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మోతాదులో అప్పులు చెయ్యడంపై తీవ్ర విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో ఏం సమాధానం చెప్పలేక కూటమి సర్కారు తలపట్టుకుంటోంది.ప్రభుత్వ రథసారథులే పాలన గాడి తప్పిందని ఒప్పుకోవటం అందరికీ వింతగానే ఉంది. గాడి తప్పితే అదుపులో పెట్టాల్సిన వారే ఆ పని చేయకుండా కలెక్టర్లకు చెప్పడమేంటనే చర్చ కూడా మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఎమ్మెల్యేలను చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతున్నారనే వాదనకు బలం చేకూర్చినట్టవుతోంది. అంతే కాదు కేవలం రాజకీయంగానే కాదు. పాలనాపరంగానూ కూటమి వైఫల్యాలు మూటగట్టుకుందని వాళ్లంతా వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు. ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలన్నాక జులుం చెలాయించటం ఎంతోకొంత వెనకేసుకోవాలని చూడటం మామూలే. కానీ ఏపీలో ఈ వ్యవహారం శృతిమించింది. ఏపీలో మట్టి, ఇసుక, లిక్కర్ సిండికేట్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుసైగలోనే నడుస్తున్నాయని వాదన వినిపిస్తోంది. తమకు రోజువారీ మామూలు వచ్చేలాగా కొంత మంది సెట్ చేసుకున్నారని తద్వారా ఎంత అవినీతి జరిగినా లోకల్‌గా రగడ జరగకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జనంలో పేరుకుంటున్న అసంతృప్తి గురించి సీఎం హెచ్చరించినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఏపీలో పొలిటికల్ లీడర్ అంటే ఇసుక, మట్టి, మద్యం మాఫియాలో భాగం కావాల్సిందే అన్నంత దుర్మార్గంగా తయారైంది పరిస్థితి. అసలు వీటితో సంబంధం లేని నేత అంటూ ఎవరూ లేరేమో అన్నంతగా దోపిడీ జరుగుతోంది. సగం మంది ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారు. మరో సగం మంది మట్టిదోపిడీలో బిజీగా ఉన్నారు. ఎవరి ఆదాయ మార్గాలు వారు చూసుకుని సెటిలయ్యారు. ఇక మద్యం వ్యాపారం సంగతి చెప్పక్కర్లేదు. అనుచరుల పేరుతో లిక్కర్ షాపులు తీసుకుని రోజుకింత అని కలెక్షన్లు తీసుకుంటున్నారు. ఇదేదో ఏ ఒక్క పార్టీకో పరిమితమైన వ్యవహారం కాదు. మద్యపాన నిషేధం డిమాండ్ పుట్టుకొచ్చిన రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది. కొందరు నేతల రోజువారీ లిక్కర్ కలెక్షన్లు చూస్తే.. వీటితో చిన్న స్థాయి ప్రాజెక్టులు పూర్తిచేయొచ్చంటే అతిశయోక్తి కానే కాదు. పైకి బీద అరుపులు అరిచే చాలా మంది నేతలు రహస్యంగా భారీగా డబ్బు వెనకేసుకుంటున్నారు. చాలామంది ఈ సంగతి సన్నిహితులకు కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. చివరకు ఇంటెలిజెన్స్ ఆరా తీసినా అంతుచిక్కనంత రహస్యంగా డెన్లు మెయింటైన్ చేస్తున్నారు. ఈ పోకడలతోనే చంద్రాబాబుకి తల ప్రాణం తోకకి వస్తోంది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోవటానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇల్లీగల్ దందాలే కారణమనే నివేదిక రావడంతో ముఖ్యమంత్రి మింగలేక కక్కలేక ఉంటున్నారనే వాదన కూడా లేకపోలేదు. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News