Wednesday, January 21, 2026

గిరిజన రైతులకు ఇబ్బంది పెడుతున్న వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారి పై జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు…!!!

బంజార గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్..!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :

పెద్దగూడెం తండా , వనపర్తి మండలం , గిరిజన రైతులకు ఇబ్బందికి గురి చేస్తున్నందున వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయడం గురించి మంగళవారం నాడు బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ కి కలిసి ఫిర్యాదు చేశారు. వారు ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించి త్వరలోనే వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారిపై నోటీసులు పంపిస్తామని చెప్పడం జరిగిందఅని శివ నాయక్ చెప్పారు.పెద్దగూడెం తండా, వనపర్తి మండలం లో గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు , వనపర్తి లోని అటవీ భూమికి ఆనుకొని దగ్గరలో ఉన్న గిరిజన రైతుల వ్యవసాయ భూమి దగ్గరికి గిరిజన రైతులను వెళ్ళనీయకుండా ఆపుతూ రైతులపై దాడిలకు దిగుతు ఇబ్బందులు పెడుతు ఇస్టాను సారంగా వ్యవహరిస్తున్న తీరుపై
గతంలో చాలా సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నందుకు గిరిజన రైతులకు ప్రభుత్వాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 58 మందికి గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లోనే ఉన్నది అట్టి పోడు భూముల్లో కూడా గిరిజన రైతులకు రానివ్వకుండా ఫారెస్ట్ ఆఫీసర్ పి. రాణి, రేంజ్ ఆఫీసర్ నిఖిల్ రెడ్డి కలిసి దాదాపు 80 సంవత్సరాల నుండి గిరిజన రైతుల ఆధీనంలో ఉన్న భూములపై గిరిజన రైతులను సాగు చేయకుండా ,వెళ్ళనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నార అని గిరిజన మహిళలు అక్కడికి వెళ్తే కూడా వారిని బూతులు తిడుతూ లంబాడి అని పచ్చి బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్టి విషయంపై 10/03/2025 నాడు రూరల్ ఎస్సై మరియు డిఎస్పి మరియు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన ఇలాంటి న్యాయం జరగలేదు అని కావున గిరిజన రైతులపై బూతు మాటలు తిట్టిన ఫారెస్టర్ ఆఫీసర్ పి. రాణి పై మరియు రేంజ్ ఆఫీసర్ నిఖిల్ రెడ్డి పై చర్యలు తీసుకొని ఎస్సి ఎస్సి అట్రాసిటీ కింద కేసు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని గిరిజన రైతులకు న్యాయం చేయగలరని శివ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ కు కోరడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News