నేటి సాక్షి, బెజ్జంకి:
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో మంగళవారం ప్రీ-ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల, ఆట వస్తువుల ప్రారంభోత్సవ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి భాస్కర్ ముఖ్య అతిథిగా, మండల విద్యాధికారి మహతి లక్ష్మీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, గుండారం గ్రామంలోని ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందనీ. త్వరలోనే ఈ పాఠశాలకు కంప్యూటర్లు కూడా కేటాయిస్తాం అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీ రాములు, హై స్కూల్ హెచ్ఎం నాగవేణి, పూర్వ ప్రధానోపాధ్యాయులు రామంచ రవీందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఎల్కంటి శ్రీనివాస్ రెడ్డి, ఎలుక దేవయ్య, సాన వేణు తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





