నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 18 గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది ,కుటుంబ సభ్యుల కథనం మేరకు… మండలంలోని పంచాయతీ కేంద్రం పెద్ద కొండా మరికి చెందిన శ్రీనివాసులు 38 కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు గత ఒకటిన్నర సంవత్సరం క్రితం కుటుంబ కలహాలతో భార్య వేరొక చోటకి వెళ్లిపోయింది ,అప్పటినుంచి కుమార్తె మతిస్థిమితం లేని కుమారుడిని చూసుకుంటూ శ్రీనివాసులు ఉండేవాడు ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కిందకి పడిపోయాడు గుర్తించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే మార్గమధ్యంలోనే శ్రీనివాసులు మరణించాడు.

