*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* టిపిసిసి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాణాసంచా కాల్చి కాంగ్రెస్ శ్రేణులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. గన్నేరువరం మండలం లోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, చింతల శ్రీధర్ రెడ్డి, మాతంగి అనిల్, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, బొడ్డు సునీల్, జువ్వాడి మన్మోహన్ రావు, చిట్కూరి అనంతరెడ్డి, దేశారాజ్ అనిల్ రాపోల్ నవీన్, న్యాత నరేష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

