Thursday, March 19, 2026

*గుడ్ మార్నింగ్..కోరుట్ల.!** 2వ వార్డులో ఎమ్మెల్యే సంజయ్ పర్యటన* మౌలిక వసతులపై ప్రత్యక్ష పరిశీలన—-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )’గుడ్ మార్నింగ్..కోరుట్ల’ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని 2వ వార్డు హాజీపూరా ప్రాంతంలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం పర్యటించారు. వార్డులోని డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. తాజాగా మంజూరైన నిధులలో భాగంగా ఈ వార్డుకు అవసరమైన పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మున్సిపల్ డీఈ, కమిషనర్‌లకు ఎమ్మెల్యే ఆదేశించారు.*పరిశుభ్రతే ప్రాధాన్యం*(అధికారులకు స్పష్టమైన ఆదేశాలు)వార్డులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా రోజువారీ శానిటేషన్ చర్యలను మరింత బలోపేతం చేయాలని వార్డ్ ఆఫీసర్‌, మున్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. చిన్నపాటి సమస్యలు పెద్ద అవరోధాలు కాకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని చిన్న పనులను వెంటనే పూర్తి చేసేలా అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.*ప్రజలతో ముఖాముఖి*(సమస్యలకు తక్షణ పరిష్కారం హామీ)పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా విని స్పందించారు. ‘ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ సమస్య అయినా వెంటనే పరిష్కారమవుతుంది’ అని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News