నేటి సాక్షి :జిన్నారం (గుమ్మడిదల)_ ప్రాకారం నిర్మాణ పనులకు శంకుస్థాపనగుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో గల రామాలయం పునర్నిర్మాణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం హానర్ ల్యాబ్ పరిశ్రమ సహకారంతో ఒక కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయం ప్రాకారం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని దైవత్వం ఉట్టిపడేలా పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ దశరథ్, సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు బాల్ రెడ్డి, పరిశ్రమ ప్రతినిధి రవీందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు





