*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* గురుకుల విద్యాసంస్థల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గురుకుల బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.తెలంగాణ తొలి సిఎం కేసిఆర్ నాయకత్వంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అదే వ్యవస్థను భ్రష్టు పట్టించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉండటం బాధాకరమని తెలిపారు. గురుకులాల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కేటీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకుల వ్యవస్థను మెరుగుపరచాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.కె. అప్రోచ్, అరికెల వినయ్ కుమార్, మార్గం కార్తికేయ, సాయి నవీన్, ఎస్.కె జుబేర్ లింగంపల్లి అబ్బి అనురిత్ శివ పాల్గొన్నారు





