నేటిసాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన గురు తేగ్ బహదూర్ 350వ వర్ధంతిలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు తేగ్ బహదూర్ 10 సిక్కు గురువుల్లో తొమ్మిదవ వారన్నారు. తొలిగురువు నానక్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధనకు సిక్కు సోదరులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

