Tuesday, March 17, 2026

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు మిర్యాలగూడ గ్రామీణ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ రైల్వేస్టేషన్ లో పనిచేస్తున్నటువంటి కీమాను శ్రవణ్ కుమార్ లైన్ చెకింగ్ చేస్తున్న క్రమంలో, రైల్వే స్టేషన్ కు సుమారు 150 మీటర్ దూరంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం, వయస్సు (35) సంవత్సరాలు కలిగి ఉండి, నలుపు రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు ఆకాశం నీలం రంగు నిలువగీతల అంగీ, అతని చేతి పైన ఐ లవ్ యు రాజ్, వెంకటేష్, లోకేష్, అను టాటూ మార్క్ ఉన్నదని, ఇతను దాదాపు రెండు రోజుల క్రితం చనిపోయినట్లుగా కనిపిస్తున్నదని,ఇతనిని ఎవరైనా గుర్తించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి సెల్ : 87126 70189, 8712670151 నెంబర్ల కు ఫోను చేయవచ్చని,శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ గదిలో ఉంచడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News