Tuesday, March 10, 2026

గొప్పదాతగా పారిశ్రామికవేత్తగా ఎదిగిన.

దొడ్డ మోహన్ రావు జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.

నేటి సాక్షి, నర్సంపేట,జూన్ 28: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో నిర్వహించిన దాత ,పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు సంతాపసభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.దొడ్డ మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట ప్రాంత ప్రజలు గర్వపడేలా గొప్ప దాతగా, పారిశ్రామికవేత్తగా ఎదిగిన దొడ్డ మోహన్ రావు జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
తను పుట్టి పెరిగిన గ్రామా,ప్రాంతా ప్రజల ఆకాంక్షమేరకు ఎన్నో సేవా అభివృద్ధి కార్యక్రమాలలో దాతగా పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక, భక్తీ భావాన్ని కలిగించే గొప్ప ఆలయాలను శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం,శ్రీ రామ లింగేశ్వర ఆలయలను నిర్మించి శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజల మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు.నియోజకవర్గ ప్రజల వైద్య సేవలకోసం నిర్మించిన మెడికల్ కళాశాలకు 20 ఎకరాల స్థలాన్ని దాతగా అందించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
నేను శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో చేస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలలో దాతగా పాల్గొన్నారు
ఈ గ్రామంలోని చెరువులను మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా దత్తాత తీసుకొని అభివృద్ధి చేశారు.
ఎందరో పేద విద్యార్థుల చదువులకోసం ఆర్థిక సహాయం అందించారూ,కరోనాతో చనిపోయిన పేద కుటుంబ లను ఆదుకున్నారు.
దాతగా మోహన్ రావు ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిఉంటాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇంచార్జి, మాజీ మున్సిపల్ చైర్మ పర్సన్ ,మాజీ జడ్పీటీసీ,కౌన్సిలర్ మాజీ ఎంపిటిసిలు,మాజీ సర్పంచ్ లు, సొసైటీ డైరెక్టర్ లు,వివిధ గ్రామాల ప్రజలు,అన్ని సంఘాల రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News