నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 20, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఉన్న ఒక పాఠశాలలో పదో తరగతి లో బాలుడు చదువుతున్నాడు. పాఠశాలలో చేసిన తప్పుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థి బాలుడుని పాఠశాల యజమాన్యం మా పాఠశాలకు రావద్దు అంటూ తండ్రిని పిలిపించి పంపడం జరిగిందని శనివారం మరికల్ గ్రామంలో చర్చనీయా అంశమైంది. దీంతో పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు చదువుకు దూరమై గొర్రెలు కాసే పనిలో పెట్టారని చర్చించుకుంటున్నారు. పదో తరగతి పూర్తయ్యే వరకు ఎగ్జామ్ రాయలేక…. చివరకు గొర్రెలు కాసేందుకు పంపిస్తారా అంటూ చర్చించుకుంటున్నారు. ఇట్టి విషయంపై విద్యార్థి తండ్రి అయిన కురువ జోగు రాములుని జరిగిన సంఘటనపై వివరణ అడగా నా కొడుకు తప్పు చేశాడు కానీ క్షమించి పదో తరగతి పూర్తయ్యే వరకు చదివించాలని పాఠశాల యజమానాన్ని కోరిన పట్టించుకోలేదన్నారు. దండం చేస్తానన్నా పట్టించుకోలేదన్నారు. నెల రోజులుగా ఏమి చేయలేక గొర్రెల కాపరిగా పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి నా కొడుకును పదో తరగతి పరీక్షలు రాసేటట్లు చూడాలని తండ్రి కురువ జోగు రాములు కోరారు. ఇట్టి విషయంపై పాఠశాల కరెస్పాండెంట్ను వివరణ కోరగా విద్యార్థి చేసిన తప్పుకు పాఠశాల నుండి పంపించడం జరిగిందని ఆయన తెలిపారు.





