Saturday, March 21, 2026

*గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కుంభర్కర్ రాజ్యలక్ష్మి అరుణ్.**గ్రామపంచాయితీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం**కుంభర్కర్ రాజ్యలక్ష్మి అరుణ్. సర్పంచ్ అభ్యర్థి గొల్లపల్లి**

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నిక నేపధ్యంలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కుంభర్కర్ రాజ్యలక్ష్మి అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ గా తనకి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలని కోరారు.తాను సర్పంచ్ గా గెలిస్తే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో అభివృద్ధి పనులు చేపడతాను గ్రామంలో ఇండ్లు లేని పేద వారికీ ఇండ్ల నిర్మాణాలకు కావాల్సిన నిధులు వచ్చేలా చూస్తానని , గ్రామంలో సమస్యలు త్రాగునీరు,రోడ్లు మరియు మురికి కాలువలు మరియు గొల్లపల్లి కీ వైకుంఠ ధామం పరిష్కారం ఏర్పాటు మరిన్ని సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేలా తగు చర్యలు తీసుకొంటాను అని నిత్యం ప్రజలంద్యలో ఉంటూ గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామ ప్రజలకి సంక్షేమ పథకాలు అందేలా చేస్తూ గ్రామంలోని సమస్యలని పరిష్కారం చేస్తూ మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దుతాను అని అన్నారు.గ్రామంలోని ప్రజలు మరియు యువత నాకు మద్దతుగా నిలిచి ఈ ఎన్నికలో తనకి ఓటు వేసి సర్పంచ్ గా ఎన్నుకోవాలని కుంభర్కర్ రాజ్యలక్ష్మి అరుణ్ ప్రజలందరిని కోరడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News