Friday, March 6, 2026

గొల్లపల్లి లో భారీ అగ్ని ప్రమాదం

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి
( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజు 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి నుండి వెనుగుమట్ల వెళ్లే 11 కేవీ విద్యుత్ వైరు మండల కేంద్రంలోని అర్చనపెల్లి పద్మ ఇంటి దగ్గర తేగి కింద పడడం తో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో టాటా ఏస్ మరియు స్కూటీ తో పాటు ఇంటి ఆవరణలో అరబోసిన 25 క్వింటాల మొక్కజొన్న పూర్తిగా కాలి పోయాయి.దీంతో స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను ఆపివేసి మంటలను సకాలంలో ఆర్పి వేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన లో తమకు సుమారు 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు పద్మ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News