నేటి సాక్షి 27 ,డిసెంబరు పాములపాడు :—గ్రామీణ ప్రాంతాల్లో గోకులం షెడ్లతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.శనివారం మండలంలోని మద్దూరు గ్రామంలో రూ.10 లక్షలతో ఐదు మినీ గోకులం షెడ్లను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య,నందికొట్కూరు సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డిలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం, పాడి పశువుల అభివృద్ధి కోసం రాయితీ కింద చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాలతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.

