నేటి సాక్షి పాలేరు , నవంబర్ 14 :నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ లో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యతను, నిల్వలను తనిఖీ చేశారు.. ఈ సన్న బియ్యం రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లును వారు క్షుణ్ణంగా పరీశీలించారు.. ఎగుమతులు దిగుమతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు..





