నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : సంక్రాంతి పండుగ సందర్భంగా పోచమ్మ వాడ గోసంగి యువజన సంఘం రాయికల్ ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు ముగ్గుల పోటీలను రోజున ఘనంగా నిర్వహించారు. ముగ్గులు వేయడం అంటే నేలను అలంకరించడం తో పాటు మన ఇంటి ఆచారాలను సంప్రదాయాలను గౌరవించడం అదేవిధంగా ఇంటి ముగింట వేసిన ముగ్గు ఇంటికి కొత్తకల తెస్తుంది మనసుకు ప్రశాంత ఇస్తుందిని వారు అన్నారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణయతలుగా వేల్పుల గంగరాజం, కడకుంట్ల అభయ రాజ్ చెంగలి మహేష్ ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందిన మహిళలకు మరియు పిల్లలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాజా మాజీ 4 వ వార్డు కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి బహుమతులు అందజేశారు. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షులు సొరపాక గంగవ్వ, కలమడుగు బాలామణి, గోసంగి యువజన సంఘం సభ్యులు కలమడుగు నారాయణ, సోరుపాక రవీందర్, కేతం గంగరాజం, కలమడుగు భూమేష్, సొరపాక శివరామకృష్ణ, కలమడుగు రమేష్, సిర్ర ప్రణయ్ కుమార్ కలమడుగు రాజశేఖర్, మల్యాల రాజు, కలమడుగు రాజం, అల్లే బీమయ్య, తదితరులు పాల్గొన్నారు

