నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 17 స్థానిక చౌడేపల్లి శబరిష్ గ్యాస్ ఏజెన్సీ యొక్క కార్యాలయం గోడౌన్లను తహసిల్దార్ పార్వతి తనిఖీ చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఉందన్న అపోహలు నేపథ్యంలో తాసిల్దార్ పార్వతి తనిఖీ చేశారు ,గ్యాస్ కొరత లేదని బుక్ చేసుకున్న వారికి అందరికీ చేరుతుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు . ప్రభుత్వం ఎక్కడ గ్యాస్ కొరత లేకుండా చూస్తుందని ఏజెన్సీ వారు గ్యాస్ వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించకుండా సకాలంలో అందించాలని సూచించారు ,ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, అనంతరం గోడౌన్ లోని గ్యాస్ సిలిండర్లను అదేవిధంగా రికార్డులను తనిఖీ చేశారు, ఈ కార్యక్రమంలో శబరీష్ గ్యాస్ ఏజెన్సీస్ ప్రొప్రైటర్ విజయలాపురం మోహన్ బాబు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు,





