. నేటి సాక్షి జనవరి-07 పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడులో గ్రామ సర్పంచ్ మేకల.భాగ్యమ్మ తరపున ఆమె కుమారుడు మేకల.రాజశేఖర్ రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్లపోదలను, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేకల.భాగ్యమ్మ, ఆమె కుమారుడు మేకల.రాజశేఖర్ లు మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కే.జీ. రోడ్డుకు ఇరువైపులా, మరియు గ్రామంలోని ఇతర రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్లపోదలను, చెత్తాచెదారాన్ని జెసిబి సహాయంతో తొలగించి, ట్రాక్టర్ల ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్ ను డంపింగ్ యార్డ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు, మరియు గ్రామంలో శుభ్రం చేయించిన గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మకు, ఆమె కుమారుడు మేకల.రాజశేఖర్ కు, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ కు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల డాక్టర్-ఎం.మహమ్మద్ బేగ్, ఫార్మసిస్టు- మూసా సలాం, హెల్త్ ఎడ్యుకేటర్- జి.మల్లికార్జున, యుడిసి- నారాయణదాసు, ఎంఎన్ఓ లు సి.హరికృష్ణ, యన్.పుల్లయ్య, తదితర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది.

