నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడవ రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ గురువారం జిల్లా జనరల్ అబ్జర్వర్ రమేష్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా సాగాలనే ఉద్దేశంతో ఈ రాండమైజేషన్ జరుగుతుందని వివరించారు.*ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం*జగిత్యాల జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది నియామకం నుంచి లాజిస్టిక్స్ వరకూ ప్రతి అంశాన్ని ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారులు రఘువరన్, మదన్మోహన్, రేవంత్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.___




