నేటి సాక్షి, నారాయణపేట,డిసెంబర్ 2,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని గ్రామపంచాయతీ నామినేషన్ వేసే క్లస్టర్ల కార్యాలయాలను నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం నాడు పరిశీలించారు. ఎన్నికల అధికారులను పలు సమస్యల పై అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ నామినేషన్ వేసేందుకు వచ్చినా సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట మరికల్ మండల ఎంపీడీవో పృథ్వీరాజ్ , మండల ఎంపీవో పావని మరికల్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





