నేటి సాక్షి నారాయణపేట, మార్చ్,12, ,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీకి సంబంధించిన దుకాణదారులు వేలంపాటలో దుకాణాలను దక్కించుకున్న వారికి వెంటనే అప్పగించడం జరుగుతుందని మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం, మరికల్ గ్రామంలో గల గ్రామపంచాయతీ దుకాణాలను వద్దకు పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, సిబ్బంది వెళ్ళినారు. పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ వేలంపాటలో దక్కించుకున్న వారికి రెండు రోజుల లోపల దుకాణాలను అప్పగించాలని అన్నారు. తక్షణమే దుకాణదారులు ఖాళీ చేయాలని దుకాణ యజమానులను ఆదేశించారు. లేనియెడల గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా ఖాళీ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. కోర్టుకు వెళ్లిన దుకాణాదారులు కిరాయిలు ప్రతినెల చెల్లించాల్సి ఉంటుందని, అందుకు దుకాణదారులకు నోటీసులు కూడా అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. సకాలంలో మరికల్ గ్రామపంచాయతీ దుకాణదారులు అద్దె చెల్లించని యేడల దుకాణాలను ఖాళీ చేయిస్తామని సూచించారు.





