Tuesday, March 3, 2026

గ్రామాలలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలి…బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ – తక్షణమే ఇంటింటికి నీటి కుళాయి సౌకర్యం కల్పించాలి – బోరింగ్ లోని పాత పైపులను మరమ్మత్తులు చేయాలి – తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలి – గ్రామంలో చలివేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి- బిజెపి “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా పిజిఆర్ఎస్ లో వినతి పత్రాలు

నేటి సాక్షి 02 మార్చి పాములపాడు:-పాములపాడు మండలంలోని, పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ కోరారు. భారతీయ జనతా పార్టీ “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా సోమవారం పీజీఆర్ఎస్ లో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్ లకు మండలంలోని, గ్రామాల్లో తాగునీటి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ వేంపెంట, మిట్టకందాల, తుమ్మలూరు, పాములపాడు మరియు పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సమస్య లేకుండా చేయాలని, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు. వేంపెంట గ్రామంలోని, శ్రీరామ్ నగర్ లో గత కొన్ని నెలలుగా తాగునీరు బోరింగ్ పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తాగునీటి బావిలో చెత్తాచెదారం చేరడంతో నీరు వాడుకోవడం లేదని, బోర్లు వేశారు కానీ బోరింగ్ సెట్టింగ్ బిగించలేదు. కృష్ణారావుపేటలోని, మాదిగ పేటలో గల బోరింగ్ గత కొన్ని నెలలుగా శిథిలవస్తులకు చేరింది. ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. మిట్టకందాల గ్రామంలో బోరు వేశారు కానీ కుళాయిలు బిగించలేదు. బోరింగ్ సెట్టింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కువగా నీరు వృధా అవుతూ వృధా అయిన నీరు వీధుల వెంట ప్రవహిస్తూ దుర్వాసనతో దోమలు ఏర్పడి రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ వద్ద బోరింగ్ మరమ్మతులకు నోచుకోక నీళ్లు రావడం లేదు. బోరింగ్ చుట్టూ చెత్తాచెదారులతో దుర్వాసన విరజులుతుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు గోపాలకృష్ణయ్య,, ప్రవీణ్, గోపాల్, బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News