Sunday, March 15, 2026

*గ్రామాలలో సంక్షేమ, సహాయ కార్యక్రమాల వెల్లువ** తుఫాను బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ* పంపిణి చేస్తున్న డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు..

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పిట్టల వాని పాలెం)తుఫాను వారిలో పడకుండా ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు కృషి చేసిన అధికారులకు శాసనసభ్యులు నరేంద్ర వర్మ కు ప్రత్యేకంగా పిట్టలవానిపాలెం మండల అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి ధన్యవాదాలు తెలిపారు.వేగేశన నరేంద్ర వర్మ గారి ఆదేశానుసారం నెల మొదటి తారీకు ఉదయాన్నే సంక్షేమ పథకాలు అయినా సామాజిక పెన్షన్ల పంపిణీ, రేషన్ సరుకుల పంపిణితో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న కూటమి ప్రభుత్వం వీటికి తోడు సహాయక కార్యక్రమంలో భాగంగా మొంథా తుఫాను భాదితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయుట జరిగింది దీనితో పల్లెలలో గ్రామాలలో ప్రజలు సంతోషంతో ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుచున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గ్లోరి మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండిన కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి నెల మొదటి తారీకున ఎన్టీఆర్ సామజిక పింఛన్లు పంపిణి చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అని రుజువు చేసుకుంది ఈ సందర్బంగా ఉదయాన్నే పింఛన్ పంపిణి చేస్తున్న సచివాలయ సిబ్బంది కి అభినందనలు తెలిపారు.ఒక వైపు పింఛన్ పంపిణి చేస్తూ, మరోవైపు మొంథా తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. తుఫాను పరిస్థితులను ముందుగా అంచనా వేసి పార్టీలకు అతీతంగా పునరావాస కేంద్రాలకు తరలించి ప్రాణ, ఆస్థి నష్టం జరుగకుండా శాసనసభ్యులు సూచనలు మేరకు కర్తవ్యం, నిర్వహణ చేసిన మండల రెవెన్యూ అధికారి మరియు రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అదేవిదంగా గ్రామ రెవెన్యూ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి కి అభినందనలు , గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ రోజు నుంచి నవంబర్ నెల రేషన్ పంపిణి చేస్తూనే, తుఫాన్ సహాయం నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తున్న రేషన్ డీలర్ ను ఈ సందర్బంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో VRO వెంకటేశ్వర రెడ్డి, నర్రా హరికృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News