నేటిసాక్షి, మిర్యాలగూడ :పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరం మూడవ రోజు మిర్యాలగూడ మండల పరిధిలోని గూడూరు మరియు కృష్ణాపురం గ్రామాలలో సోమవారం మురుగు కాలువల పరిశుభ్రత చర్యలు, పచ్చదనం పరిశుభ్రత పై కార్యక్రమాలను నిర్వహించారు. గూడూరు కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థుల శ్రమశక్తి ద్వారానే పల్లెల అభివృద్ధి సాధ్యమని, గ్రామాల్లో అపరిశుభ్రమైన సమస్యలన్నీ వేగంగా పరిష్కారం కావడానికి విద్యార్థుల సేవలు అమూల్యమని వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సత్యం, కళాశాల ప్రిన్సిపల్ భీమర్జున్ రెడ్డి, నాగరాజు, డా. రవీందర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీను, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ శ్రీనివాసరావు, డా. స్వప్న మరియు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతరులు, ఎన్ఎస్ఎస్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.





