నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 17 :తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రజా ప్రతినిధులను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన. అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శాలువ కప్పి, స్వీట్లు తినిపించి మంత్రి అభినందనలు తెలిపారు. అలాగే ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా అభినందిస్తూ… గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులను కూడా కలిసి ఆయన మాట్లాడారు. అధైర్యపడొద్దని, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని హితవు పలికారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధైర్యం చెప్పారు.





