Tuesday, March 24, 2026

* గ్రామాల్లో మొబైల్ నెట్ వర్క్ సమస్య పరిష్కరించాలి.* కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నేటి సాక్షి నంద్యాల 04:—-నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పరిధిలోని ప్యాపిలి, బేతంచెర్ల, డోన్ మండలాల్లో వేలాది కుటుంబాలు తీవ్రమైన మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య కు పరిష్కారం చూపాలని కోరుతూ గురువారం న్యూ ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆయన కార్యాలయలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. ప్యాపిలి, భేతంచెర్ల, డోన్ మండలాల్లోని వేలాది కుటుంబాలు తీవ్రమైన మొబైల్ నెట్ వర్క్ సమస్యను ఎదుర్కొంటున్నారని, మా ప్రజల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకెళ్లారు. ఎంపీ శబరి విన్నపాన్ని కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News