నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 04:ప్రశాంతమైన గ్రామాల్లో రాజకీయ గొడవలకు తావివ్వొద్దు అని కూసుమంచి ఎస్ఐ నాగరాజు అన్నారు.. గురువారం సాయంత్రం కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల వచ్చాయి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఎన్నికలను సజావుగా జరిగేలా గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.. గొడవలు సృష్టించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. తురకగూడెం గ్రామానికి మండలంలో మంచి పేరుంది ఆ పేరును కొనసాగించాలన్నారు.. చదువుకున్న యువకులు రాజకీయ గొడవల్లో తలదూర్చుతే భవిష్యత్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని హెచ్చరించారు.. ఎటువంటి అలజడులు లేకుండా గ్రామంలో ప్రశాతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు..





