నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గ్రామాల అభివృద్ధి కోసం బిజెపి మద్దతు ఇస్తున్న సర్పంచ్ లను గెలిపించాలని ఆ పార్టీ మండల ఎన్నికల ఇన్చార్జి కరివేద మైపాల్ రెడ్డి భార్గవి రెడ్డిలు పిలుపునిచ్చారు గన్నేరువరం మండల కేంద్రంతో పాటు గునుకుల కొండాపూర్ లో సర్పంచ్ అభ్యర్థులు సంద వేణి ప్రశాంత్ సొల్లు అజయ్ వర్మ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గ్రామాలలో అనేక పనులు జరుగుతున్నాయన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మండల అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తిప్పర్తి నికేష్ సర్పంచ్ అభ్యర్థి సంధ్య వేణి ప్రశాంత్ సొల్లు అజయ్ వర్మ మచ్చ బాలరాజ్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు





