నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకం ద్వారా నూటికి నూరుశాతం అమలు చేస్తారని అదేవిధంగా ఇలాంటి పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి వస్తారని చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి అన్నారు శుక్రవారం తిరుపతి రూరల్ మండలంలోని మంగళం , పైడిపల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు పెరటి కోళ్ళు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన ఆమెకు మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు అనంతరం పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యం అని అన్నారు. అందులో భాగంగా దుర్గసముద్రం పంచాయతీ పైడిపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు కూటమి ప్రభుత్వం పెరటి కోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఒక్కొక్క సభ్యురాలు 3100 రూపాయలు కడితే 8 పెట్టలు, 3 పుంజులు కిట్టు రూపంలో మంజూరు చేస్తుందన్నారు. ఇలా తిరుపతి రూరల్ మండల పరిధిలో 116 కిట్లు మంజూరైనట్లు సుధా రెడ్డి తెలిపారు మహిళలు అంచలంచెలుగా ఎదగడానికి ఏదో ఒక అవకాశం అని అన్నారు. పెరటి కోళ్ళు కిట్లను సంఘ సభ్యులకు పులివర్తి సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఊరిబిండి మౌనిక మునిశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి,కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.





