Wednesday, March 18, 2026

*గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలు*• సర్పంచ్ బొల్లికొండ జయరాజు

నేటి సాక్షి అనంతగిరి: గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సర్పంచ్ బొల్లి కొండ జయరాజు తెలిపారు.మండల పరిధిలోనీ వెంకట్రామాపురం గ్రామంలో మహిళా సంఘం భవన తోపాటు పదో వార్డులోని సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక సర్పంచ్ బొల్లికొండ జయరాజు బుధవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు ఆర్థిక,సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని,స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని అన్నారు.రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల సహకారంతో 10 లక్షల వ్యయంతో మహిళ సంఘం భవనాన్ని,అదేవిధంగా 5లక్షల వ్యయంతో రామ్ రెడ్డి పాలెం ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు.గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగలక్ష్మి,ఉపసర్పంచ్ చల్ల కోటయ్య,10వ వార్డు మెంబర్ పర్వతం కవిత శ్రీను,పాలకవర్గం,గ్రామ పెద్దలు అమరనేని వేదాంతరావు,వేనేపల్లి దామోదర్ రావు,హర్ష బాలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News