అమీర్ పేట్ లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన..దేపభాస్కర్ రెడ్డి, సిహెచ్ యాదయ్య
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం మరియు అమీర్‌పేట్ గ్రామం లో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమాల్లో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన బీరప్పఅక్క మహంకాళి దేవాలయం మరియు శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్,ఏఎంసీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, శివగంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్,ఒగ్గు శంకర్,అంద్య నాయక్,గల్ల శ్రీకాంత్,శ్రీను,బాలయ్య, కేజే ప్రసాద్,యాదగిరి, జయంత్ తదితరులు పాల్గొన్నారు.