Monday, December 23, 2024

గ్రూప్-2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్​లు

నేటి సాక్షి, కరీంనగర్​: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్​లు నిర్వహిస్తున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, పెద్దపల్లి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్​లైన్ ద్వారా www.tgbcstudycircle.cgg.gov.inలో జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పరీక్షలు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్​లో జూలై 8,9,15,16,22,23,30,31 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు.. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టెస్టులు ఉంటాయని ఆయన చెప్పారు. మరిన్ని వివరాలకు 0878-2268686ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News