నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా చాహాత్ బాజ్ పయ్ శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్ సర్వీసుల పై అవగాహన ఉందని స్పష్టం చేసిన కమిషనర్. సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు తోడ్పడడంతో పాటు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానాన్ని, శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య, చెత్త తరలింపు జరిపే వాహనాలకు జీపి ఎస్ అనుసంధానం తదితర అంశాలను సంబంధిత విభాగాల అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగర అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. అనంతరం బల్దియాలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది కమిషనర్ కు పుష్ప గుచ్చాలు, పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

